భారతదేశం, డిసెంబర్ 14 -- ఓటీటీలో తెలుగు కంటెంట్ రోజు రోజుకీ బాగా విస్తరిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు ఎన్నో రకాల జోనర్లలో తెలుగు ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ప్రతి ఆదివారం సరికొత్త కథతో ఓటీటీ మూవీ స్ట్రీమింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇవాళ అంటే డిసెంబర్ 14న సరికొత్తగా తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం ఒకటి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే సింధు. ఒక పాప కోసం రెండు కుటుంబాలు పడే ఆరాటాన్ని, గొడవలను ఇందులో చూపించారు. అసలు ఆ పాప ఎవరు, ఏ కుటుంబానికి చెందినది అనేదే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా తెలుస్తోంది.

సింధు సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మధునందన్, లావణ్య రెడ్డి, సీవీఎల్ నరసింహ రావు, బేబీ భూమి ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు ఆర్కే నా...