భారతదేశం, ఆగస్టు 6 -- రికార్డులు సృష్టించిన అతీంద్రియ ఫాంటసీ సిరీస్ 'వెడ్నెస్డే' (Wednesday) నెట్‌ఫ్లిక్స్‌లో రెండో సీజన్‌తో తిరిగి వస్తోంది. వణుకు పుట్టించే సీన్స్ తో వేరే లెవల్ థ్రిల్ అందించేందుకు వెడ్నెస్డే ఆడమ్స్ నెవర్‌మోర్ అకాడమీకి రిటర్న్ వస్తుంది. జెన్నా ఒర్టెగా సూపర్ నేచురల్ పవర్స్ కలిగిన టీనేజర్‌గా ప్రధాన పాత్రలో నటించింది. వెడ్నెస్డే సీజన్ 2 కథ మొదటి సీజన్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి కొనసాగుతుంది అని 'టుడే' నివేదించింది. వెడ్నెస్డే కొత్త సీజన్ ఒక రహస్యమైన వ్యక్తితో భయానకంగా ఉండబోతోంది.

సూపర్ నేచురల్ ఫాంటసీ, హారర్ థ్రిల్లర్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ను వెడ్నెస్డే రెండో సీజన్ పార్ట్ 1 ఊరిస్తోంది. ఈ సిరీస్ సీజన్ 2 మొదటి భాగం ఇవాళ (ఆగస్టు 6, 2025, బుధవారం) నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ట...