Hyderabad, సెప్టెంబర్ 25 -- ఓటీటీలోకి ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. వాటిలో హారర్ నుంచి కామెడీ వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, దాదాపుగా అన్ని రకాల జోనర్లను కలగలిపి ఒకేదాంట్లో తెరకెక్కిస్తే. అదే అలైస్ ఇన్ బార్డర్‌ల్యాండ్. ఈ సిరీస్ గురించి తెలియని ఓటీటీ మూవీ లవర్స్ ఉండరు.

అంతలా ఈ సిరీస్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్‌ను దాదాపుగా అని రకాల ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా తెరకెక్కిస్తుంటారు. ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అలైస్ ఇన్ బార్డర్‌ల్యాండ్ రెండు సీజన్స్ సూపర్ హిట్ సాధించాయి. వాటికి ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ కూడా ఉంది.

ఆంతేకాకుండా రొట్టెన్ టొమాటోస్ సంస్థ 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. అలాంటి ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ కోసం అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ ఎంతగాన...