Hyderabad, మే 8 -- మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా ఓటీటీలో మలయాళ సినిమాలను అధిక సంఖ్యలో వీక్షిస్తుంటారు ఆడియెన్స్. అలాగే, వాటి కంటెంట్ కూడా చాలా డిఫరెంట్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇక మలయాళంలో పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్, మంజుమ్మెల్ బాయ్స్ యాక్టర్ సౌబిన్ షాహిర్, హృదయం హీరోయిన్ దర్శన రాజేంద్రన్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు.

వీరిలో ఏ ఒక్కరి సినిమా అయిన దానికి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఈ ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన సినిమా ఒకటి ఉంది. అదే ఇరుల్. మలయాళంలో హారర్ థ్రిల్లర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. కేవలం గంటన్నర రన్‌టైమ్ మాత్రమే ఉన్న ఈ సినిమాను జోమోన్ టీ జాన్, ఆంటో జోసెఫ్, షామీర్ ముహమ్మద్ నిర్మించారు.

అయితే, ఇదివరకే మలయాళంలో ఇరుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో...