Hyderabad, మే 15 -- ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతి వారం సరికొత్త ఓటీటీ సినిమాలు ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా ఇవాళ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

ఆ సినిమానే అనగనగా. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా చేసి అలరించిన సుమంత్ అనగనగా మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు. అలాగే, వ్యాస్ అనే టీచర్‌గా యాక్ట్ చేశాడు సుమంత్. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన అనగనగా సినిమా స్కూల్ నేపథ్యంలో సాగుతుంది.

విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే అనగనగా సినిమాలో విద్యార్థులపై ఒత్తిడి, పిల్లలకు ఎలా పాఠాలు చెబితే అర్థం అవుతుందనే అంశాలను చూపించారు. అలాగే, తండ్రికొడుకుల మధ్య ఉండే ఎమోషనల్, తల్లి ప్రాధాన్యత ఎల...