భారతదేశం, నవంబర్ 28 -- ప్రతి వారం ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వస్తుంటాయి. కానీ, వాటిలో ఎక్కువగా ఒక ఫ్రైడే మాత్రం అధికంగా ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. అలా ఇవాళ 20 వరకు ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిఫరెంట్ జోనర్లతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ స్పెషల్ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటీ, వాటి ప్లాట్‌ఫ్లామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ, బ్యూటిఫుల్ శ్రీలీల జోడీగా మరోసారి నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే మాస్ జాతర. హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేసిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో అంతంత మాత్రంగా మాస్ జాతర టాక్ తెచ్చుకుంది.

నేడు నెట్‌ఫ్లిక్స్‌లో మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో మాస్ జాత...