భారతదేశం, నవంబర్ 20 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వీటిలో 3 సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ అవడం, మరో 3 తెలుగులో స్ట్రీమింగ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి ఆ 8 సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమిళంలో స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ నాడు సెంటర్. ఎమ్ శశికుమార్, సూర్య ఎస్‌కే, సూర్య విజయ్ సేతుపతి, రెజీనా కసాండ్రా తదితరులు నటించిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళం వంటి 7 భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ (నవంబర్ 20) నుంచి నాడు సెంటర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంగ్లీష్‌లో సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన మూవీ ది రోజెస్. బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ నటించిన ది రోజెస్ నేటి నుంచి జి...