భారతదేశం, డిసెంబర్ 3 -- ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 03) ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఒకేదాంట్లో ఏకంగా నాలుగు సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, వీటన్నింట్లో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

2025లో ఫినాన్షియల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది క్రిప్టో మ్యాన్. ఇది ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం. క్రిప్టో కరెన్సీ విధానం, అది ఎలా క్రాష్ అయింది వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను డైరెక్టర్ హ్యూన్ హే రి తెరకెక్కంచారు. ఐఎమ్‌డీబీలో పదికి 7.3 రేటింగ్ సాధించుకుంది ఈ సినిమా.

అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (డిసెంబర్ 03) క్రిప్టో మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన క్రిప్టో మ్యాన్ ప్రైమ్ వ...