భారతదేశం, ఏప్రిల్ 19 -- సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రానికి భారీగా ప్రశంసలు దక్కాయి. టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శతమైన ఈ చిత్రం బాగా పాపులర్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హిందీ డ్రామా మూవీ మోస్తరు కలెక్షన్లు దక్కించుకుంది. ఓటీటీలో ఇటీవలే రెంటల్ విధానంలోనూ వచ్చింది. అయితే, ఈ సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.

సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇటీవలే ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, ఏప్రిల్ 25న రెంట్ తొలగిపోనుంది. ఆరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు.

సూపర్‌బాయ్స్ ఆఫ్ ...