Hyderabad, జూలై 23 -- మలయాళం బాక్సాఫీస్ కింగ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇట్టిమాని: మేడిన్ చైనా. ఈ సినిమా సెప్టెంబర్, 2019లో రిలీజైంది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ.36 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఇట్టిమాని: మేడిన్ చైనా మూవీని గురువారం (జులై 24) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. బుధవారం (జులై 23) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది.

"అన్‌లిమిటెడ్ నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి. ఇట్టిమాని మేడిన్ చైనా.. ఓ నవ్వించే తెలుగు కామెడీ మీ దగ్గరికి వస్తోంది. జులై 24 నుంచి కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేయడం విశేషం.

ఇట్టిమాని: మేడిన్ చైనా సినిమా సెప్టెంబర్ 6, 2019లో రిలీజైంది. రూ.12...