Hyderabad, జూన్ 5 -- ఓటీటీ మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే కొందరు హీరోలకు సైతం మంచి పాపులారిటీ ఉంటుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టి అందరి మనసు దోచేశాడు.

అలాగే, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ సూపర్ ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్సాఫీస్ విజయాలతో దుల్కర్ సల్మాన్ సత్తా చాటుతున్నాడు. ఇక గతంలో దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ సినిమాలను అందించాడు.

వాటిలో చాలా వరకు మూవీస్ తెలుగులో డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా 2019లో దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ "ఒరు యమండన్ ప్రేమకథ". ఈ సినిమాను ఇప్ప...