భారతదేశం, జనవరి 15 -- తెలుగులో ఆది సాయికుమార్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ శంబాల. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది. ఇప్పుడీ మూవీ జనవరి 22 నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మరి ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

ఆది సాయికుమార్ ఓ యువ సైంటిస్ట్ పాత్రలో నటించిన మూవీ శంబాల. ఈ సినిమాను జనవరి 22 నుంచి ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. అంతేకాదు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు 24 గంటలు ముందుగానే అంటే జనవరి 21 నుంచే చూడొచ్చు.

"అపోహలు సజీవంగా మారే, విధి గర్జించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఆది సాయికుమార్ శంబాల జనవరి 22న ఆహాలో ప్రీమియర్ అవుతుంది. ఆహా గోల్డ్ యూజర్స్ కు 24 గంటల ముందే యాక్సెస్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఆది సాయి కుమార్, అర్...