భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అదే వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేసిన నయనం. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సిరీస్ సత్తాచాటుతోంది. థియేటర్లో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న వరుణ్ సందేశ్.. ఈ సిరీస్ తో ఓటీటీలో మాత్రం గ్రాండ్ గా డెబ్యూ చేశాడు.

ఓటీటీలో థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది. ఇక సస్పెన్స్ ను కొనసాగిస్తూ, ఉత్కంఠ రేపే థ్రిల్లర్లకు మరింత ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు నయనం సిరీస్ కు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ సిరీస్. ఇప్పుడు ఆ ఓటీటీలో ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ సిరీస్ గా కొనసాగుతోంది నయనం.

నయనం వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. ఈ ఎ...