భారతదేశం, డిసెంబర్ 28 -- ఓటీటీలో తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ లేటెస్ట్ హిట్ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఓటీటీలో వ్యూస్ తో దూసుకెళ్తోంది. మరి మీరు ఈ రొమాంటిక్ మూవీని చూశారా? లేదంటే ఇప్పుడే ఓ లుక్కేయండి.

తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీలో అదుర్స్ అనిపిస్తోంది. ఈ లేటెస్ట్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 18 న ఇది ఓటీటీలో రిలీజైంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఓటీటీలో చూసేందుకు మరో ప్రత్యేకత ఉంది. అదే ఎక్స్ టెండెడ్ కట్. అంటే థియేటర్లో లేని కొన్ని సీన్లన...