భారతదేశం, నవంబర్ 23 -- ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన మూడు తమిళ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్నాయి. గ్లోబల్ ట్రెండింగ్ కొనసాగుతున్నాయి. ఈ మూడు మూవీస్ డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. అవే.. డ్యూడ్, బైసన్, డీజిల్. ఈ మూడు తమిళ సినిమాలు ఇప్పుడు ఓటీటీని ఏలుతున్నాయి. ఇవి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.

ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. డ్యూడ్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో డ్యూడ్ సినిమా గ్లోబల్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఇది జెన్ జెడ్ రొమా...