భారతదేశం, ఆగస్టు 28 -- ఓటీటీలో తెలుగు, తమిళం, మలయాళం అనే లాంగ్వేజ్ డిఫరెన్స్ లేదు. కంటెంట్ బాగుంటే ఏ భాషలోని సినిమా అయినా చూసేందుకు డిజిటల్ ఆడియన్స్ రెడీగా ఉంటున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్లు ఏ భాషలోనివైనా అందరినీ అలరిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి రెండు తమిళ థ్రిల్లర్లు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇందులో ఒకటి సర్వైవల్ థ్రిల్లర్ 'గెవి' కాగా, మరొకటి ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ 'మాయకూతు'.

తమిళ థ్రిల్లర్లు రెండు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సర్వైవల్ థ్రిల్లర్ గెవి, ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ మాయకూతు సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆగస్టు 27నే ఓటీటీలో అడుగుపెట్టాయి. ఈ చిత్రాలకు ఐఎండీబీలో 9కి పైగా రేటింగ్ ఉండటం విశేషం. గెవి రేటింగ్ 9.2 కాగా.. మాయకూతు రేటింగ్ 9.6గా ఉంది. థియేటర్లలో ఈ రెండు సినిమాలు పాజిటివ్ రెస్...