భారతదేశం, జూలై 31 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ లెక్కల గురించి, బడా హీరోలా గురించి పట్టింపు ఉండదు. కంటెంట్ బాగుంటే చిన్న హీరోల సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతాయి. థియేటర్లలో ఆదరణ లేని చిన్న సినిమాలు కూడా ఓటీటీని ఊపుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లు డిజిటల్ స్ట్రీమింగ్ తో తమ ముద్రను బలంగా వేస్తున్నాయి. రికార్డు వ్యూస్ రాబడుతున్నాయి. ఓటీటీలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.

చౌర్య పాఠం (chaurya paatham).. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రీసెంట్ గా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ రాబరీ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్ తో జై కొట్టించుకుంటోంది. 2025 ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్లు ...