భారతదేశం, ఆగస్టు 18 -- ఓటీటీలో థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎంతో మంది. ఎప్పుడెప్పుడు మంచి థ్రిల్లర్ మూవీ లేదా సిరీస్ వస్తుందోనని వెయిట్ చేస్తుంటారు. అలాంటి సిరీస్ వస్తే వదులుతారా? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ కు ఇదే కారణం. మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ సీజన్ 2 అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు.

కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఆగస్టు 14న ఓటీటీలో రిలీజైంది. ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఫస్ట్ డే నుంచే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మంచి కంటెంట్ ఉన్న ఒరిజినల్ సిరీస్ లు అందించే ఈటీవీ ఈ కానిస్టేబుల్ కనకంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సిరీస్ ఇప్పటిక...