భారతదేశం, నవంబర్ 16 -- ఓటీటీలోకి ఇటీవల తెలుగు కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా అచ్చ తెలుగు భాషతో స్వచ్ఛమైన కథలను అందిస్తున్నారు. ఇక ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ప్రతి ఆదివారం ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతుంది.

అలా ఇవాళ (నవంబర్ 16) ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమా ఇగో (Ego Movie OTT). విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రంగా ఇగో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ లేడి డాన్‌గా కనిపించింది. అలాగే, మ్యాడ్, శుభం సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న చరణ్ పెరి స్కూల్ టీచర్‌గా చేశాడు.

ఈ ఇద్దరితోపాటు ఇగో సినిమాలో భాను తేజ్ కదిమిసెట్టి, అశోక్ సీపల్లి, అసురఖాళీ పవన్, ఆషిష్ కెన్నెడి, సూర్య గౌడ్, అజయిల్పి కిస్కింద, షేక్ ముఖ్తర్ అహ్మద్, సాయి కదిర, భాను ప్రకాష్ అమాస, సూర్య భరద్వ...