Hyderabad, సెప్టెంబర్ 26 -- 'ఓజీ' సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1: పవన్ కల్యాణ్ 'ఓజీ'తో చరిత్ర సృష్టించాడు. సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్‌ను సొంతం చేసుకున్న ఓ నాన్-పాన్-ఇండియా సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును దాటింది.

పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన ఓజీ ఊహించినట్లే సరికొత్త చరిత్రకు నాంది పలికింది. బాక్సాఫీస్ దగ్గర మంచి స్టార్ట్ తీసుకుంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు వసులు చేసినట్లు మూవీ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసింది.

"ఇదీ పవన్ కల్యాణ్ సినిమా.. ఓజీ చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్త తొలి రోజు గ్రాస్ రూ.154 కోట్లు" అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది. దీనికి మూవీలోని ఓ పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ పోస్టర్ ను జోడించింది. ఇప్పటి వర...