భారతదేశం, నవంబర్ 7 -- మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలోని అతిపెద్ద దిగ్గజాల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డ్స్, నెలకొల్పిన ఘనతలు అన్ని ఇన్నీ కావు.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఓజీ మూవీతో ఫుల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ సుజీత్. రన్ రాజా రాన్, సాహో సినిమాలతో అలరించిన సుజీత్ వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూపించి హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యంగ్ డైరెక్టర్ సుజీత్ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టింది టెక్నో పెయింట్స్. రెండు తెలుగు రాష్ట...