భారతదేశం, డిసెంబర్ 16 -- పవన్ కల్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద ఓజీ రూపంలో వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపింది. దీంతో తనకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన ఖరీదైన బహుమతికి సంబంధించిన ఫొటోలను సుజీత్ మంగళవారం (డిసెంబర్ 16) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

"జీవితంలో బెస్ట గిఫ్ట్ ఇది. మాటలకు అందని కృతజ్ఞతా భావంతో నిండిపోయాను. మా డియరెస్ట్ ఓజీ పవన్ కల్యాణ్ గారి నుంచి అందిన ప్రేమ, ప్రోత్సాహం వర్ణించలేనిది. చిన్నప్పుడు అభిమానిగా ఉన్నప్పటి నుంచీ ఇప్పుడీ ప్రత్యేక క్షణం వరకు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను" అనే క్యాప్షన్ తో సుజీత్ పో...