Hyderabad, సెప్టెంబర్ 25 -- ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఓజీ తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. బ్యూటిఫుల్ ప్రియాంక మోహన్ ఓజీ సినిమాలో హీరోయిన్‌గా పవన్ కల్యాణ్ సరసన యాక్ట్ చేసింది.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి ఓజీ సినిమాలో విలన్‌గా చేశాడు. ఇమ్రాన్ హష్మి తెలుగు తెరకు పరిచయం అవుతున్న తొలి సినిమా ఇదే. తమన్ సంగీతం అందించిన ఓజీ సీనిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దాన్య నిర్మాతగా నిర్మించారు.

ఇక ఓజీ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో ఓజీ సినిమా రిలీజ్ కానుంది. కానీ, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి ఓజీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. అవి చూసిన నెటిజన్స్, ఆడియెన్స్ ఈ మూవీ ఎలా ...