Hyderabad, సెప్టెంబర్ 27 -- ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

స్పెషల్ ప్రీమియర్స్ షోల నుంచి ఓజీ సినిమాకు బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియాలో రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓపెనింగ్ డే అంటే విడుదలైన రోజు గురువారం (సెప్టెంబర్ 25) రూ. 63.75 కోట్ల నెట్ కలెక్షన్స్ భారత్‌లో రాబట్టింది ఓజీ. ఈ రెండు కలుపుకుని మొత్తంగా ఇండియాలో ఓపెనింగ్ డే రోజున ఓజీ రూ. 84.75 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే, రెండో రోజున ఓజీ కలెక్షన్స్ కాస్తా పడిపోయాయి. ఇండియాలో రెండో రోజు అయిన శుక్రవారం (సెప్టెంబర్ 26) నాడు ఓజీ సినిమా రూ....