Hyderabad, సెప్టెంబర్ 24 -- తెలుగులో మరో సినిమాటిక్ యూనివర్స్ రాబోతోంది. అది ఓజీ యూనివర్స్. అది డైరెక్టర్ సుజీత్ యూనివర్స్. కేవలం 23 ఏళ్ల వయసులోనే రన్ రాజా రన్ తో సంచలనం సృష్టించి, తర్వాత ప్రభాస్ తో సాహో తీసి.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దే కాల్ హిమ్ ఓజీ మూవీతో వస్తున్న సుజీత్ షేర్ చేసిన నోట్ ఇంట్రెస్టింగా ఉంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ తో తన సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మరో టాలీవుడ్ యువ డైరెక్టర్ సుజీత్ కూడా అదే హింట్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ తో అతడు తీసిన ఓజీ మూవీ గురువారం (సెప్టెంబర్ 25) రిలీజ్ కానుండగా.. బుధవారం అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో తన ఓజీ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. రానున్న రోజుల్లో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం పెద్దది కాబోతోందని అతడు అనడం గమనార్హం.

"దే క...