భారతదేశం, నవంబర్ 18 -- ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీసును ఓఎల్ఎక్స్‌లో ఓ ఆకతాయి అమ్మకానికి పెట్టాడు. దాని ధర కేవలం రూ.20 వేలు మాత్రమే అని పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి వెళ్లింది. దీంతో తహసీల్దార్ షాక్ అయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్ ఆఫీసు అమ్మకం గురించి తెగ వైరల్ అయింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం OLXలో రూ.20,000కు అమ్మకానికి ఉంది. ఓ ఆకతాయి రెండు రోజుల క్రితం OLX యాప్‌లో ప్రభుత్వ కార్యాలయం చిత్రాన్ని అప్‌లోడ్ చేశాడు. అది వెంటనే అమ్మకానికి అందుబాటులో ఉందని తెలిపాడు.

ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి కంగుతిని పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. OLXలో అందించిన వివరా...