భారతదేశం, జనవరి 11 -- హైదరాబాద్‌లో నీటి ఇబ్బందలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భాగ్యనగరానికి నీటిని అందించే కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, జంట జలశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఓఆర్ఆర్ మాదిరిగానే నగరం చుట్టూ.. 140 కిలోమీటర్లతో రేడియల్ రింగ్ మెయిన్ పైపు‌లైన్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసేందుకు చూస్తోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ప్రధాన పైపులైన్స్ వేస్తారు. దానికి అనుసంధానంగా సిటీలోకి నీటిని సరఫరా చేయడానికి మరో 96 కిలోమీటర్లు అంతర్గత నెట్‌వర్క్ సృష్టిస్తారు. దీంతో నగరం నలుమూలలకూ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తారు.

రూ.7,200 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ప్రతిపాదిత వాటర్ రింగ్ ప్రధాన ప్రాజెక్టులో నగరం చుట్టూ ...