భారతదేశం, అక్టోబర్ 31 -- హలోవీన్ వీకెండ్ వచ్చిందంటే చాలు.. భయానక లైట్లు, లేట్-నైట్ పాప్‌కార్న్, వెన్నులో వణుకు పుట్టించే షోల లైనప్ ఉండాల్సిందే. మీకు జంప్ స్కేర్స్ ఇష్టమా? అతీంద్రియ రహస్యాలు నచ్చుతాయా? లేదా డార్క్ హ్యూమర్ కావాలా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, బీబీసీ ప్లేయర్, జియోహాట్‌స్టార్‌లలో ప్రతీ ఒక్కరికీ నచ్చేవి ఉన్నాయి. దెయ్యాల కామెడీల నుంచి నిజ జీవిత క్రైమ్ హారర్‌ల వరకు అద్భుతమైన షోలు ఉన్నాయి.

బీబీసీ ప్లేయర్ లో మీకు నవ్వులతో కూడిన భయం కావాలంటే'ఘోస్ట్స్' సరైన ఎంపిక. BAFTA నామినేట్ అయిన ఈ బ్రిటిష్ కామెడీ హారర్ థ్రిల్లర్ పాడుబడిన ఒక ఎస్టేట్‌ను వారసత్వంగా పొందిన ఒక యువ జంట కథ. అక్కడికి వెళ్లాక వారికి చిత్రవిచిత్రమైన దెయ్యాల గుంపు తారసపడుతుంది. ఈ షో హాస్యాన్ని, భయాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. తేలికపాటి హలోవీన్ రాత్రికి ఇ...