భారతదేశం, అక్టోబర్ 26 -- ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ వణికిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో భయపెడుతోంది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారిన ఆ వెబ్ సిరీస్ 'ఇట్: వెల్‌క‌మ్ టు డెర్రీ'. ఈ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఓ క్లాసిక్ గా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ సోమవారం (అక్టోబర్ 27) ఇండియాలో ఓటీటీలో రిలీజవుతుంది. ఇప్పుడు హెచ్బీవో మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెరికన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇట్ వెల్‌క‌మ్ టు డెర్రీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ రేపు (అక్టోబర్ 27) ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జియోహాట్‌స్టార్‌లో మన దగ్గర ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే ఈ సిరీస్ ఈ రోజు హెచ్బీవో మ్యాక్స్ లో ఇండియా బయట రిలీజైంది. 8 ఎపిసోడ్ల సిరీస్ ఇది.

వెల్కమ్ టు డెర్రీ సిరీస్ ఒక రహస్య సైనిక స్థావరం ఉన్న చిన్న అమెరికన్ పట్టణంలో ఒక దుష్టశక్తిత...