భారతదేశం, ఏప్రిల్ 28 -- ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా చంపారు. ఒళ్లంతా తూట్లు పొడిచారు. ఈ మర్డర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చాలా కిందటే మర్డర్ ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది. నిందితులు పక్కాగా రెక్కీ నిర్వహించి.. హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిరిన ఒప్పందం కీలకంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.వీరయ్య చౌదరిని చంపడానికి 3 నెలల కిందటే నిందితులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రెండు వారాల ముందే ఒంగోలు శివారులోని ఓ లాడ్జిలో మకాం వేసి... పక్కాగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన కుట్రదారుతో పాటు కీలక నిందితుడి కోసం హైదరాబాద్, విశాఖ ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

2.వీరయ్య చౌ...