Hyderabad, సెప్టెంబర్ 8 -- ఈ వీకెండ్‌లో దుబాయ్‌లో జరిగిన సైమా 2025 కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. చాలా మంది నటీనటులు రెడ్ కార్పెట్‌పై వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. లక్ష్మీ మంచు కూడా ఇలాగే ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగారు. అయితే ఈ సందర్భంగా తనను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ పై ఆమె మండిపడింది. వాళ్లను ఆమె తిడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు అక్కడ ఏం జరిగిందో చూడండి.

ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసిన వీడియోలో లక్ష్మీ మంచు రెడ్ డ్రెస్ లో ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. ఆ సమయంలో ఎవరో వెనుక నుంచి ఆమెను ఏదో అన్నారు. దీంతో సెల్ఫీ తీసుకోవడం ఆపేసి ఆమె వాళ్లపై మండిపడింది. "ఒరెయ్.. నా ముందు వచ్చి మాట్లాడురా, ఎవరు వాడు? టైం, సెన్స్ లేదు మీకు, రాస్కెల్స్" అని అనడం స్పష్టంగా వినిపించింది.

ఇక వాళ...