Hyderabad, ఏప్రిల్ 27 -- డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీని నిర్వహణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలి కాలంలో, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు డయాబెటిస్ నియంత్రణలో సహాయపడగలవా అనే అంశంపై విస్తృతమైన పరిశోధన జరుగుతోంది. ఈ కొవ్వులు ముఖ్యంగా చేప నూనెతో పాటు కొన్ని మొక్కల ఆధారిత ఆహారాలలో లభిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం నుండి వాపును తగ్గించడం వరకు, ఒమేగా-3లు డయాబెటిస్ ఉన్నవారికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే, ఒమెగా 3లు డయాబెటిస్ చికిత్సలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? అనే అంశం గురించి మరింత వివరాల్లోకి వెళితే..

మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ: కొన్ని పరిశోధనల ప్రకారం, చేప నూనెలో కనిపించే EPA, DHA వంటి ఒమెగా-3 కొవ్వు యాసిడ్లు, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్...