భారతదేశం, నవంబర్ 4 -- అప్పుడెప్పుడో ఓ డిటెర్జెంట్ పౌడర్ గురించి మరక మంచిదే అంటూ ఓ యాడ్ వచ్చింది గుర్తుందా?.. అలాగే స్ట్రెస్ కూడా మంచిదే అంటుంది సైకాలజీ. మనం సాధారణంగా స్ట్రెస్ ఒక నెగటివ్ విషయంగానే చూస్తాం. నిద్ర లేమి, ఆందోళన, ఆరోగ్యం దెబ్బతినడం వంటి దుష్ప్రభావాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. స్ట్రెస్ లో ఓ సానుకూల కోణం కూడా ఉంది. అన్ని రకాల స్ట్రెస్ లు మనకు హాని చేయవు, కొన్ని మంచి కూడా చేస్తాయి. ఇలా మంచి చేసే దాన్నే యూస్ట్రెస్ అంటారు. ఈ "మంచి ఒత్తిడి" మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఏటా నవంబర్ నెలలో మొదటి బుధవారాన్ని అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం గా పరిగణిస్తారు. ఈ సందర్భంగా యూస్ట్రెస్ వల్ల జరిగే మంచి ఏంటో తెలుసుకుందాం.

యూస్ట్రెస్ అనేది సానుకూల ఒత్తిడి. ఇది మనల్ని ఉత్సాహపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. మన సామర్థ్యాన్ని పె...