Hyderabad, ఏప్రిల్ 25 -- ప్రస్తుత జీవనశైలిలో ప్రతిరోజూ శరీరం కన్నా ఎక్కువగా మన మెదడును, మనసును ఉపయోగిస్తుంటాం.ఇంటి పనీ, ఆఫీసు పనీ, ఫోన్ నోటిఫికేషన్లు, ఎక్స్‌పెక్టేషన్లు, డెడ్‌లైన్లు, ఎమోషన్లు ఇవన్నీ కలసి మనలో ఓ రకమైన ఆంతరిక గందరగోళాన్ని సృష్టిస్తుంటాయి. ఈ సమయంలో మన మనసుని ప్రశాంతంగా ఉంచి, అంతర్గతంగా మనల్ని బలంగా మార్చే మార్గం ఏదైనాఉందా అంటే.. అది శ్వాస వ్యాయామాలు అంటే ప్రాణాయామం ఒక్కటే అంటున్నారు వైద్య నిపుణులు.

ప్రాణాయామాలలో భ్రమరీ ప్రాణాయామం (Bhramari Pranayama) చాలా ప్రత్యేకమైనది.మనసును, శరీరాన్ని, ఆత్మను ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఇబ్బందుల నుంచి తప్పించే ప్రశాంతంగా మార్చే శక్తి దీనికి ఉంటుంది. ఇది శబ్దం ద్వారా మనసును ప్రభావితం చేసే అద్భుతమైన సాధన.దీన్ని చేయడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి.

"భ్రమరీ"అనేది సంస్కృత పదం, దీని అర్థం "తే...