భారతదేశం, మార్చి 14 -- ఉత్తర, దక్షిణ భారతాల మధ్య పెరుగుతున్న వివాదానికి తమిళనాడు సీనియర్ మంత్రి దురైమురుగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నిపై ఆజ్యం పోసినట్టుగా మారాయి. ఉత్తర భారతంలో బహుభర్తృత్వం (ఒకే స్త్రీకి అనేక భర్తలు), బహుపత్నిత్వం (ఒకే పురుషునికి అనేక భార్యలు) సర్వసాధారణమని ఆయన ఆరోపించారు. తమిళ భాషను అవమానించిన వారి నాలుక కోస్తామని హెచ్చరించారు. దేశంలో జనాభా ఆధారంగా ప్రతిపాదించిన పునర్విభజనపై ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ఒక సభలో మాట్లాడుతూ దురైమురుగన్ మహాభారతాన్ని ఉఠంకించారు. ఉత్తర భారతంలో ఒక స్త్రీ అనేక పురుషులతో వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని అన్నారు. "మా సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు, కానీ ఉత్తర భారతంలో ఒక స్త్రీ ఐదు లేదా పది మంది పురుషులను వివాహం చేసుకోవచ్చు. అక్కడ ఐదుగు...