భారతదేశం, జనవరి 27 -- పెళ్లయ్యాక ఓ అమ్మాయి ఎన్నో ఆశలతో, తీపి కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. పుట్టి పెరిగిన ఇల్లు, కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి, పూర్తిగా కొత్త వ్యక్తుల మధ్యకు వస్తుంది. ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆమెకు అక్కడ మద్దతు పలికేవారు కూడా ఉండాలి. కొత్త కోడలు తన అత్తమామలను తన తల్లిదండ్రులుగా, అత్తారిల్లును తన ఇల్లుగా భావిస్తుందో ఆమె ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. అయితే కేవలం కోడలే కాదు. ఆమె అత్తమామల ప్రవర్తన కూడా ఆమె జీవితాన్ని నిర్ణయిస్తుంది. అదృష్టవశాత్తూ, కొంతమంది అమ్మాయిలకు మాత్రమే కూతురులా చూసుకునే అత్తమామలు దొరుకుతారు. ఒక వివాహిత జీవితాన్ని ఆనందంగా ఉంచాలన్నా. నరకంగా మార్చాలన్న అతవారింట్లోని ముగ్గురే నిర్ణయిస్తారు.

అత్తా కోడళ్ల అనుబంధం శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంద...