భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ 'బన్ బటర్ జామ్' (Bun Butter Jam) దూసుకొచ్చింది. అయితే ఇండియాలో రిలీజ్ కంటే ఒక రోజు ముందుగానే ఓవర్సీస్ ఆడియన్స్ ను ఇది ఎంటర్ టైన్ చేస్తోంది. తమ పిల్లలకు పెళ్లి చేయాలనే ఇద్దరు అమ్మల ప్లాన్ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది.

తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ బన్ బటర్ జామ్ ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 4) వచ్చింది. కానీ ఇప్పుడే ఇండియన్ ఆడియన్స్ కు అందుబాటులో లేదు. రేపు (సెప్టెంబర్ 5) ఇక్కడి ప్రేక్షకులు ఈ మూవీని ఓటీటీలో చూడగలరు. ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో యూకేలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది.

రాజు జెయమోహన్ హీరోగా ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లుగా నటించిన బన్ బటర్ జామ్ సినిమాకు రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్...