భారతదేశం, జనవరి 28 -- సినిమా టికెట్ల మరీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్న ఈ రోజుల్లో ఓం శాంతి శాంతి శాంతి: మూవీ మేకర్స్ మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టికెట్ కేవలం రూ.99 మాత్రమే అని అనౌన్స్ చేయగా.. ఇప్పుడు జంటలకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం విశేషం.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన మూవీ ఓం శాంతి శాంతి శాంతి: . ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే అంటే జనవరి 29న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ షోలు పడే థియేటర్ల లిస్టు రిలీజ్ చేస్తూ వాటిలో ఈ ఆఫర్ అనౌన్స్ చేశారు.

అగనంపూడిలోని ఏషియన్ ముక్తా, అమలాపురంలోని వీపీసీ ఎస్సీ 2, మచిలీపట్నంలోని మినీ రేవతి, అనంతపురంలోని గౌతమి థియేటర్లలో ఈ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు. వీటిలో జంటగా వెళ్తే ఒకటి టికెట్ కు మరో టికెట్ ఫ్రీగా ఇస్తారు...