భారతదేశం, ఏప్రిల్ 20 -- ఎనీవన్ బట్ యూ సినిమా ఆశ్చర్యపరిచే రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ సాధించింది. సిడ్నీ స్వీనీ, గెన్ పోవెల్ లీడ్ రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2023 డిసెంబర్‌లో రిలీజై భారీ హిట్ కొట్టింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే వ్యూస్ దక్కాయి. అయితే, తాజాగా ఓ ఓటీటీలో డిలీటై.. మరో ప్లాట్‍ఫామ్‍లోకి ఈ ఎనీవన్ బట్‍యూ మూవీ ఎంట్రీ ఇచ్చింది.

ఎనీవన్ బట్‍ యూ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా గతేడాది ఏప్రిల్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చింది. సుమారు ఏడాది పాటు ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ తర్వాత ఇప్పుడు తొలగిపోయింది. వెంటనే సోనీ లివ్ ఓటీటీలోకి ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఎనీవన్ బట్‍ యూ సినిమా ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో ఇంగ్లిష్‍లో స్ట్రీమ్ అవుతోంది. డీల్ ప్రకారం సంవత్సరం మాత్ర...