భారతదేశం, ఫిబ్రవరి 10 -- బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా (Govinda) తన దాంపత్య జీవితంలో గొడవలపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇటీవల అతని భార్య సునీత అహుజా చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. గోవిందాకు వివాహేతర సంబంధం ఉందనే కోణంలో వస్తున్న పుకార్లపై ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా స్పందించాడు.

గోవిందా తనదైన శైలిలో స్పందిస్తూ.. "నాపై ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. ఇది చిన్ననాటి ప్రేమ అని అంటున్నారు. కానీ కొందరి ఆలోచన ప్రకారం చూస్తే.. ఇది ముసలితనంలో పుట్టిన ప్రేమ అనుకోవాలి" అంటూ పరోక్షంగా సెటైర్ వేశాడు. ప్రేమ విషయంలో తనకు ఎప్పుడూ కలిసి రాలేదని అతడు అనడం విశేషం.

తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ గోవిందా ఎమోషనల్ అయ్యాడు. "నేను నలుగుర...