భారతదేశం, జనవరి 2 -- భారతదేశంలో ఏ రోడ్డు మీద చూసినా హ్యుందాయ్ క్రెటా కార్లు కచ్చితంగా దర్శనమిస్తాయి! ఇది మన భ్రమ కాదు.. గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్‌లో హ్యుందాయ్ సంస్థ ఏకంగా 2 లక్షలకు పైగా క్రెటా యూనిట్లను విక్రయించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంటే సగటున రోజుకు దాదాపు 550 క్రెటా కార్లు అమ్ముడయ్యాయన్నమాట!

భారత మార్కెట్లోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా, ఫ్యామిలీ ఎస్​యూవీ క్రెటా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకూ పెరుగుతోంది. అసలు ఈ ఎస్‌యూవీకి ఇంతలా జనం ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఈ అసాధారణ విజయానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.

హ్యుందాయ్​ క్రెటా ఎస్​యూవీ భారత మార్కెట్లోకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లలో ఈ బ్రాండ్ పట్ల బలమై...