భారతదేశం, జూలై 26 -- ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన దేశభక్తి థ్రిల్లర్ మూవీ 'సర్జమీన్' (Sarzameen) అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్సకు దేశభక్తి అనే కథాంశం జోడించి ఈ ఫిల్మ్ ను తెరకెక్కించారు. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, హిందీ సీనియర్ నటి కాజోల్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్స్ ప్లే చేశారు.

సర్జమీన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. జులై 25 నుంచి ఈ సినిమా జియోహాట్‌స్టార్‌ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్క రోజులోనే ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ హిందీ ఒరిజినల్ ఫిల్మ్ హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఓటీటీలోకి అడుగుపెట్టింది. బోమన్ ఇరానీ కుమారుడు కయ...