భారతదేశం, డిసెంబర్ 6 -- థియేటర్లలో సత్తాచాటిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఇండియాలో టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ మూవీ. ఇందులో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.

రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌. ఇది డిసెంబర్ 5న ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ఓటీటీలోనూ అదుర్స్ అనిపిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే టాప్ లోకి దూసుకెళ్లింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీ...