భారతదేశం, జనవరి 23 -- సంక్రాంతి బరిలో నిలిచి అనూహ్యంగా హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా నిలిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ మూవీ. ఇప్పుడీ సినిమా సక్సెస్ మీట్ లో హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మళ్లీ పెద్ద సినిమాలు చేసే వరకు తాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన మూవీస్ చేస్తానని అనడం గమనార్హం.

నారీ నారీ నడుమ మురారీ మూవీ హిట్ కావడంతో శర్వానంద్ మాంచి ఊపు మీదున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

"ఈ విజయానికి కారణమైన ఓ వ్యక్తిని అన్నా అని పిలవాలని అనిపిస్తోంది. అనిల్ సుంకరగారు.. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. థ్యాంక్స్ చెప్పి ఇక్కడితో రుణం తీర్చుకోవాలని అనుకోవడం లేదు. ఒ...