భారతదేశం, నవంబర్ 9 -- నటుడు దుల్కర్ సల్మాన్ తన రాబోయే తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 'కాంత' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళలోని లులూ మాల్‌ను సందర్శించి, అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన స్క్రిప్ట్ ఎంపిక గురించి ప్రస్తావన రాగా, ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో నటుడు వివరించాడు. పరోక్షంగా 'కింగ్ ఆఫ్ కొత్త' (2023) గురించి ప్రస్తావించాడు.

ఒక అభిమాని మైక్ తీసుకుని దుల్కర్‌ సల్మాన్ ను ప్రశంసిస్తూ.. 'మీరు ఇంత మంచి స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకుంటారు?' అని అడిగాడు. దానికి సమాధానంగా దుల్కర్ పరోక్షంగా 'కింగ్ ఆఫ్ కొత్త' గురించి గుర్తుచేసేలా కామెంట్లు చేశాడు.

"సినిమాలు ఆడినప్పుడే అది మంచి ఎంపిక అవుతుంది. ఆడనప్పుడు కాదు. నా సినిమాలు హిట్టయితే నా స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతం అంటారు. అదే నా సినిమా ఒకటి ఫ్లాప్ అయితే, అతనికి స్క...