Hyderabad, ఫిబ్రవరి 24 -- పరీక్షల కాలం వచ్చేసింది. తమ పిల్లలు నిత్యం చదువుతూనే ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిపై తీవ్రమైన ఒత్తిడి చేస్తారు. కోపంతో అరుస్తారు. చదవకపోతే తిడతారు. ఇవన్నీ కూడా పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. తెలిసీ తెలియకుండా తల్లిదండ్రులు చేసే ఈ పనులు పిల్లల మానసిక స్థితి పై ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ఒత్తిడిని వారు తట్టుకోలేక ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఒక ప్రిన్సిపల్ ఇవన్నీ ఆలోచించే తల్లిదండ్రులకు ఒక హృదయపూర్వకమైన విజ్ఞప్తిని చేసింది.

ఒక పాఠశాల ప్రిన్సిపల్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లేఖలో ఒక్క పరీక్షలే మీ పిల్లల జీవితాన్ని నిర్ణయించవని ఆమె చెప్పింది. గణితంలో ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి మాత్రమే జీవించడం లేదని, కెమిస్ట్రీలో స్కోర్ చేసిన వారే ఎదగడం లేదని... ఒక సంగీత కారుడు, చరిత్రకారుడు కూడా...