Hyderabad, సెప్టెంబర్ 1 -- భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు. కానీ, ఒక సినిమాకు అందులో వచ్చే డైలాగ్స్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలో అసలు సంభాషణలు లేకుండా తెరకెక్కించే ధైర్యం చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన సినిమా ఉఫ్ఫ్ యే సియాపా. ఈ సినిమా సరికొత్త నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ బోల్డ్ సైలెంట్ కామెడీ-థ్రిల్లర్ డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది.

పూర్తిగా హావభావాలతో, పర్ఫామెన్స్‌ని ఆధారంగా చేసుకుని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికగా ఉఫ్ఫ్ యే సియాపా సినిమా తెరకెక్కనుంది. ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ ఈ సినిమా...