భారతదేశం, జనవరి 22 -- ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించిన బోర్డర్ మూవీకి సీక్వెల్ గా బోర్డర్ 2 వచ్చేస్తోంది. శుక్రవారమే (జనవరి 23) సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ వచ్చేసింది. అయితే మూవీలో డైలాగులు లేదా సీన్లలో ఎలాంటి కట్ ను సెన్సార్ బోర్డు ప్రతిపాదించకపోవడం గమనార్హం. కొన్ని చిన్న మార్పులు మాత్రమే సూచించినట్లు సమాచారం.

బోర్డర్ 2 సినిమాలోని సీన్స్ తొలగించకపోయినా.. సెన్సార్ బోర్డు కొన్ని చిన్న మార్పులను మాత్రం సూచించింది. సినిమాలో సన్నీ డియోల్ పోషించిన పాత్రకు సంబంధించి, చివరలో వచ్చే క్రెడిట్స్ లో 'ఫతే సింగ్' అనే అసలు పేరును చేర్చాలని కోరారు. నిబంధనల ప్రకారం యుద్ధ విమానంపై కనిపించే భారతీయ జెండా దృశ్యాలను సినిమా అంతటా మార్చాలని, సరైన పద్ధతిలో చూపాలని సూచించారు. ఇక సినిమాలో చూపించిన యుద్ధ నౌక పేరు...