Andhrapradesh, జూన్ 25 -- యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు.

మంగళవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే యువతను కూడా నైపుణ్యం పోర్టల్ లో నమోదు చేయించటం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు.

యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్‌ను డిజైన్ చే...