Hyderabad, ఆగస్టు 8 -- నటిగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్మృతి ఇరానీ.. ఈ మధ్యే తనను స్టార్ ను చేసిన టీవీ సీరియల్ కు తిరిగి వచ్చిన విషయం తెలుసు కదా. అభిమానులకు నచ్చిన తులసి విరాణి పాత్రతో 'క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2' ద్వారానే ఆమె తిరిగి టీవీలోకి వచ్చింది. అయితే ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె భారతీయ టెలివిజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నిలిచింది. ఇప్పుడు, ఒక ఇంటర్వ్యూలో స్మృతి ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఆమె ఎంత మొత్తం తీసుకుంటున్నారో మాత్రం చెప్పలేదు.

స్మృతి ఇరానీ సమకాలీన నటీమణులైన 'అనుపమ' ఫేమ్ రూపాలి గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.3 లక్షలు, హీనా ఖాన్ రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటారు. తాజాగా సీఎన్‌ఎన్‌-న్యూస్18తో జరిగిన ఒక ఇంటర్వ్...